శ్రీ కృష్ణ అష్టమి పర్వదినాన శ్రీమతి కిలపర్తి వెంకట రమణమ్మ, కూకట్పల్లి, హైదరాబాద్ గారి సహాయంతో
సదాశివపేట మండలం, ఎన్కేపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న నాగరిగారి పండరి అనే వ్యక్తి గత రెండు సంవత్సరాలుగా అరుదైన కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నారు.. నడుము కింది భాగం పూర్తిగా చచ్చుబడిపోయి ఇంటికే పరిమితం అయ్యారు. తన భార్య పద్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబ పోషణ చేస్తున్నారు.. వైద్యం చేయించుకోవడానికి ఆర్థికస్థితి సహకరించక ఇబ్బందులు పడుతున్నారు.. వీరికి సూహృత్ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం రూ.2500 నగదు అందజేయడం జరిగింది.
అదే విధంగా షాదనగర్ లో నివాసముంటున్న చంద్రయ్య గారికి Rs.2000 లను మెడిసిన్స్ మరియు నిత్యావసర సరుకుల నిమిత్తం అందించడం జరిగింది.
ఈ సేవ కార్యక్రమాలకు విరాళాలను అందించిన శ్రీమతి కిలపర్తి వెంకట రమణమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము