*Felicitations to Writer Sri.Munnuru Nagaraju On His First Book “Alochana Marithe Jeevitham Maruthundhi”*
*రచయిత మున్నూరు నాగరాజు గారికి సన్మానం*
సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో *ఆలోచన మారితే జీవితం మారుతుంది* పుస్తక రచయిత *శ్రీ మున్నూరు నాగరాజు* గారికి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (No.1), సదాశివపేట, సంగారెడ్డి జిల్లా నందు ముఖ్య అతిథి *శ్రీ పులిమామిడి రాజు గారి* చేత సన్మానం చేయడం జరిగింది.
మరియు పాఠశాలకు కొన్ని పుస్తకాలు క్రీడ వస్తువులు అందించడం జరిగింది.అలాగే స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు *శ్రీమతి అన్నపూర్ణ* గారు అధ్యాపక బృందం, ట్రస్ట్ సభ్యులు*రచయిత మున్నూరు నాగరాజు గారిని**దాత, కౌన్సిలర్ శ్రీ పులిమామిడి రాజు గారిని**ట్రస్టు అధ్యక్షులు శ్రీ కనకమామిడి నరేందర్ గౌడ్ గారిని* సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ పులిమామిడి రాజు గారు పాఠశాల సమస్యలు తేలుసుకొని స్కూల్ కాంపౌండ్ నిర్మిస్తానని మరియు డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు
.మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి స్కూల్ ప్రధాన సమస్యలు తీర్చడానికి ముందుకు వచ్చిన *శ్రీ పులిమామిడి రాజు గారికి* హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
.సన్మాన కార్యకమ ఏర్పాటు కు సహాయ సహకారాలు అందించిన దాతలు*శ్రీ కనకమామిడి నరేందర్ గౌడ్ గారికి**శ్రీ కొలచిన రామకృష్ణ గారికి**పంబళ్ల శ్రీనివాస్ గారికి**పాలడుగు నాగరాజు గారికి**శ్రీమతి హిమబిందు గారికి* ధన్యవాదాలు తెలియజేస్తున్నాము