*Heartfelt Thanks to Police Department*
*దైవం మనుష్య రూపేణా..*
ట్రస్టు సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం 12 ఫిబ్రవరి 2022 నాడు జాతీయ రహదారిపై వెళుతుండగా ట్రస్ట్ ఓమ్ని వెహికిల్ ఆగిపోవడంతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్నీ, అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీస్ వారు చూసి అందరూ కలిసి వాహనాన్ని ప్రక్కకు నెట్టి పెట్రోల్ తెప్పించి ఇచ్చి మాకు సహాయాన్ని అందించి దారి చూపారు.మరియు కరోన లాక్డౌన్ సమయంలో కూడా సేవ కార్యక్రమాలు నిర్వహించుటకు మాకు అనుమతి ఇచ్చిన పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
కల్లెదుట నేరుగా దర్శనమివ్వదుగా ఏ దైవం.! మానవ రూపేణా పంపేనుగా తన సాయం..!! ఆకలి అన్నవాడికి అన్నం పెట్టేవాడు, సమస్య అన్నవాడికి సాయం చేసేవాడు, అర్థంకాని ఈ అందాల లోకాన ఎందెందు వెతికిన అందందే గలడు ఆ ఆపద్బాంధవుడు.